బస్సు నడుపుతుండగానే గుండెపోటుతో డ్రైవర్ మృతి

ప్రకాశం: బస్సు నడుపుతూనే హార్ట్ ఎటాక్ తో ఆర్టీసీ డ్రైవర్ మరణించిన సంఘటన శుక్రవారం ఒంగోలులో జరిగింది. పొదిలి నుంచి విజయవాడకు వెళ్తుండగా ..బస్సు ఒంగోలుకు చేరుకోగానే అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో డ్రైవర్ హనుమంతరావు బస్సును సైడుకు ఆపి సీటులోనే కుప్పకూలిపోయాడు. గుర్తించిన ప్రయాణికులు హాస్పిటల్ కి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందాడు. ఘటన జరిగిన సమయంలో బస్సులో తొమ్మిది మంది ప్రయాణికులున్నారు. గుండెపోటు వచ్చినప్పటికీ బస్సును సేఫ్ ప్లేస్ లో పెట్టి, ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన డ్రైవర్ హనుమంతరావు.. చివరకు తాను మాత్రం ప్రాణాలు వదిలాడని ఆవేదన వ్యక్తం చేసింది యాజమాన్యం.

Latest Updates