సంగారెడ్డి: ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం

సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం జాతీయ రహదారిపై ఆరంజ్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు ఎగిసి పడ్డాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. ప్రయాణికుల సామాన్లు దగ్ధమయ్యాయని, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పారు పోలీసులు. నాగపూర్ నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం జరిగింది. బస్సులో 26 మంది ప్రయాణికులున్నారు. మంటలకు షార్ట్ సర్క్యూటే కారణమై ఉంటుందన్నాడు డ్రైవర్. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పారు.

Latest Updates