ఆగివున్న లారీని ఢీ కొన్న బస్సు..10 మందికి గాయాలు

చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని సి.మల్లవరం దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. నాయుడుపేట నుంచి బెంగళూరు వెళ్తున్న గ్లాజు గ్లాసుల లోడు లారీ రోడ్డుపక్కన ఆగి ఉండగా ..వోల్వో బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. విజయవాడ నుండి బెంగళూరుకు వెళుతున్న బస్సు..ఇవాళ తెల్లవారుజామున సి.మల్లవరం దగ్గర ఆగిఉన్న లారీని వెనక నుంచి ఢీ కొంది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ నిద్ర మత్తు కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.  ఈ ప్రమాదంలో డ్రైవర్ కూడా గాయపడ్డాడు.

Latest Updates