లారీని ఢీకొట్టిన బస్సు: ఏడుగురు మృతి

యూపీలోని మెయిన్ పురి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు చనిపోగా… 34 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆగ్రా లక్నో ఎక్స్ ప్రెస్ వే పై ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు.

ప్రైవేట్ బస్సు ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఓవర్ స్పీడ్ కారణంగానే  ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. లారీని బస్సు వేగంగా ఢీకొట్టడంతో బస్సు ముందు బాగం పూర్తిగా ద్వంసం అయింది. ఈ ఘటనలో ఏడుగురు చనిపోగా.. మృతదేహాలు బస్సులో ఇరుక్కున్నాయి. దీంతో అతికష్టం మీద చనిపోయిన వారి మృతదేహాలను బయటకు తీసినట్లు పోలీసులు తెలిపారు.

Latest Updates