ఆగివున్న లారీని ఢీకొన్న బస్సు: ఆరుగురి మృతి

ఆగిఉన్న లారీని ఓ ప్రైవేట్ బస్సు గుద్దింది దీంతో ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటన కర్ణాటకలోని సతారా నేషనల్ హైవేపై జరిగింది. గురువారం పొద్దున పూణె-బెంగళూరు హైవే పై…. ఓ పెట్రోల్ పంపు దగ్గర లారీ ఆగి ఉండగా.. పూణె నుంచి బెంగళూరుకు వెళ్తున్న SRS ట్రావెల్స్ కు చెందిన ప్రైవేట్ బస్సు  వేగంగా వచ్చి లారీని వెనకవైపు నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సులోని ఉన్న ఆరుగురు మృతి చెందగా… మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే సతారా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డవారిని స్థానిక సివిల్ హాస్పిటల్ కు తరలించారు. మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.

Latest Updates