అవును సింహమే.. కాకపోతే గ్రామసింహం

అడవిలో ఉండాల్సిన సింహం రోడ్డు పైకి వచ్చిందని అక్కడి జనం కంగారుపడ్డారు. భయంతో వణికిపోయి వెంటనే అటవీ శాఖ అధికారులకు ఫోన్ చేసి చెప్పారు. వారు కూడా కంగారు పడి.. ఆ సింహాన్ని బంధించేందుకు రంగంలోకి దిగారు. స్థానికుల తెలిపిన ప్రాంతాల్లో గాలించి చివరకు దాన్ని పట్టుకున్నారు. భారీ సైజులో ఉన్న ఆ జంతువును పరీక్షించి ఒక్కసారిగా షాకయ్యారు. ఎందుకంటే అది అడవిలో తిరిగే సింహం కాదు. గ్రామసింహం. అదేనండి ఆ జంతువు కుక్క అని తెలిసి అధికారులు, స్థానికులు అవాక్కయ్యారు

మార్చి 7న స్పెయిన్ లో జరిగిందీ  ఘటన.  అచ్చం సింహం లాగే దాని హెయిర్ ను కట్ చేయడంతో ఆ కుక్కను సింహమనే అనుకున్నారు అక్కడి వాళ్లంతా. ఆ ప్రాంతానికి కొత్తగా వచ్చిన వాళ్లు ముందు దానిని చూడగానే ప్రాణభయంతో పరుగెడతారట.  అది సింహం కాదన్న విషయాన్ని ఫస్ట్ టైమ్ చూసిన వారెవరూ గ్రహించలేరట. ప్రస్తుతం కుక్కకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాని ఫోటోను చూసి నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు.

Latest Updates