EMI ట్రెండ్.. మనకు సెట్ అవుతుందా.?

Business analysts opinion on EMI trend

కొన్నేళ్ళ క్రితం వరకూ డబ్బులు చెల్లిస్తే… వస్తువు ఇంటికొచ్చేది. కానీ.. ఇప్పుడు ట్రెండ్ మారింది. రూపాయి పే చేయకుండానే.. వస్తువు ఇంటికొస్తోంది.  ఇప్పడు EMIల కాలం నడుస్తోంది. ఇల్లు, వెహికల్స్ కోసమే కాదు.. చిన్న చిన్న ఎలక్ట్రానిక్ గూడ్స్  కూడా EMIల పద్దతిలోనే కొంటున్నారు. మరి వెస్ట్రన్ కంట్రీలకు చెందిన EMIల ట్రెండ్ మనకి సరిపోతుందా… ఆర్థిక నిపుణులు ఏమంటున్నారో  చూద్దాం.

సిటీలో EMI కల్చర్ రోజు రోజుకు పెరుగుతోంది. కొన్నేళ్ల క్రితం వరకూ డౌన్ పేమెంట్ కింద కొంత ఎమౌంట్ పే చేస్తే..మిగతాది EMI పెట్టుకునేలా ప్రాసెస్ ఉండేది. కానీ ఇప్పుడు జీరో పేమెంట్ అనడంతో EMI జోరు మరింతగా పెరిగింది. మొదట్లో ఇల్లు, వెహికల్స్, బిజినెస్ లోన్ కు మాత్రమే EMIలు పెట్టుకునేవారు. తర్వాత టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, ఏసీలకు కూడా ఈ పద్దతి వచ్చింది. లాస్ లేకుండా వ్యాపారం నడవటంతో …. స్మార్ట్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ గూడ్స్ కు కూడా EMIలు ఇస్తున్నారు వ్యాపారులు.

ఇక ఈ-కామర్స్ బిజినెస్ వచ్చాక EMI జోరు మరింత పెరిగింది. ఆన్ లైన్ లో స్మార్ట్ ఫోన్స్ , ఇయర్ ఫోన్స్, పవర్ బ్యాంక్, షూ, డ్రెస్సెస్.. ఇలా కావాల్సిది కొనుక్కోవడం.. EMI పెట్టడం మామూలైంది. యూత్ ఎక్కువగా ఈ కామర్స్ లో EMI పెడుతున్నారు.

అవసరం మేరకు మాత్రమే EMIలు పెట్టుకోవాలని అంటున్నారు ఆర్దిక నిపుణులు.  ఈమధ్య ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ లాంటి ఎలక్ట్రానిక్ గూడ్స్ కొన్నాళ్లు వాడి కొత్త ఫీచర్స్ రావడంతో మార్చేస్తున్నారని చెబుతున్నారు. ఎప్పుడూ కూడా ఏదైనా వస్తువును కొంటే.. దాని రేటు రోజు రోజుకి పెరగాలే కానీ.. తగ్గే గూడ్స్ కొనడం మంచిది కాదంటున్నారు.

వెస్ట్రన్ కంట్రీస్ లో ఉండే ఈ ట్రెండ్ ఇక్కడకు రావడం కొంత వరకూ మంచిదే అయినా.. పూర్తిగా EMI మీద సేల్స్ జరపడం మంచిది కాదంటున్నారు ఎనలిస్టులు. సంపాదన కంటే.. వాయిదాలకు కట్టే ఎమౌంట్ పెరిగితే.. ప్రెజర్ బాగా పడుతుందంటున్నారు.

బడ్జెట్ ను మించి EMI తీసుకోవడంతో చాలాసార్లు కట్టలేని పరిస్థితులు వస్తాయి. వాయిదాలు టైంకి కట్టకపోతే..భవిష్యత్తులో సిబిల్ స్కోర్ పడిపోతుంది. సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే.. ఇక లోన్ రాదంటున్నారు ఫైనాన్సియల్ ఎడ్వైజర్స్.

Latest Updates