బ్యాంకింగ్ ఏజెంట్లకు ఇన్సూరెన్స్ ఇవ్వాలి

కరోనా వైరస్‌ భయం ఉన్నప్పటికీ.. గ్రామీణ ప్రాంత ప్రజలకు మనీ అందేలా బిజినెస్ కరె స్పాండెంట్లు పనిచేస్తున్నారు. డాక్టర్లు, నర్సులు, పోలీసులు, పారిశుధ్య కార్మికులు, జర్నలిస్ట్‌‌ల మాదిరి వీరు కూడా కరోనా ఫ్రంట్‌ రన్నర్స్‌‌గా ఉంటున్నారు. ఇంత రిస్క్ తీసుకుని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రిలీఫ్ ప్యాకే జీలను పేదలకు చేరవేస్తున్న ఈ బిజినెస్ కరెస్పాండెంట్ల ను అన్ని విధాలా ఆదుకోవాలని సబ్‌కే సీఈవో శశిధర్ తూములూరి కోరారు. వారిని కూడా ఫ్రంట్ రన్నర్లుగా గుర్తించి మెడికల్ ఇన్సూరెన్స్ కల్పించాలని, తగిన ఇన్సెంటివ్‌లు ఇవ్వాలని అభ్యర్ధించారు. బ్యాంక్‌లను, బ్యాంక్ బ్రాంచ్‌ల ను, ఏటీఎంలను, బిజినెస్ కరెస్పాండెంట్లను కూడా కేంద్ర ప్రభుత్వం అత్యవసర సర్వీసుల కింద గుర్తించింది. క్యాష్‌ను ఎప్పడికప్పుడు ప్ర జలకు అందుబాటులో ఉంచడం అనేది కూడా ఇప్పుడు కీలకంగా మారింది. బ్యాంక్‌బ్రాంచ్‌లు అందుబాటులో లేని గ్రామాల్లోబిజినెస్ కరెస్పాం డెంట్లేబ్యాంకింగ్ సర్వీసులను అందిస్తున్నారు. ఎస్‌బీఐ లాంటి పెద్ద బ్యాంక్‌లు అయితే వీరికి ఇన్సూరెన్స్, శానిటైజేషన్లసౌకర్యాలను అం దిస్తున్నాయని, కానీ చిన్న బ్యాంక్‌ల కరెస్పాం డెంట్లుమాత్రం ఇబ్బంది పడుతున్నట్టుశశిధర్‌‌ వివరించారు. బ్యాంక్‌ల నుంచి మనీ తీసుకురా వడంలో కరెస్పాండెంట్లుఇబ్బంది పడుతున్నట్టు తెలిపారు. నెట్‌వర్క్ ఇష్యూలు వస్తున్నాయని తెలిపారు. మొదట్లో30–40 శాతం ఏజెంట్లు ఆపరేట్ అయ్యేవారని, కానీ ప్రస్తుతం 90 శాతం మంది ఏజెంట్లుతమ సర్వీసులు అందిస్తున్నట్టు తెలిపారు. 10 శాతం ఏజెంట్లుఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. సబ్‌–కే తరఫున దేశ వ్యాప్తంగా ఐదు వేల మంది బిజినెస్ కరెస్పాండెం ట్లు పనిచేస్తుండగా.. తెలంగాణ, ఏపీలలో 1500 మంది పనిచేస్తున్నట్టుచెప్పారు. సబ్‌‌కే అనేది డిజిటల్ ఫైనాన్స్(ఫిన్‌‌టెక్) కంపెనీ. ఇది దేశవ్యా ప్తంగా ఫైనాన్సియల్, పేమెంట్ సర్వీసులను అఫరబు్డ ల్‌‌గా అందిస్తోంది. ఫిన్‌‌టెక్ కంపెనీల బాడీ బిజినెస్ కరెస్పాండెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(బీసీఎఫ్‌‌ఐ)కు శశిధర్ చైర్‌‌‌‌పర్సన్‌‌గా ఉన్నారు. దేశం మొత్తం మీద ఆరు లక్షల మంది బిజినెస్ కరెస్పాండెంట్లు సేవలందిస్తున్నారు.

Latest Updates