మాదాపూర్‌ లో వ్యాపారి కిడ్నాప్ కలకలం

హైదరాబాద్‌: మాదాపూర్లో  ఓ వ్యాపారి కిడ్నాప్ చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ కలహాల క్రమంలోనే ఈ కిడ్నాప్ జరిగినట్టు తెలుస్తోంది. ధీరజ్ రెడ్డి అనే వ్యాపారిని వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అయితే భార్య తరపు బంధువులే ధీరజ్‌ రెడ్డిని కిడ్నాప్ చేసినట్లు అతని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టామన్నారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Latest Updates