సోషల్ డిస్టెన్సింగ్ పై కామెంట్.. మహిళా వ్యాపారికి బెదిరింపులు

ముంబై: మురికివాడల్లో సోషల్ డిస్టెన్సింగ్ వీడియోపై కామెంట్ చేసినందుకు ముంబైకి చెందిన ఓ మహిళా వ్యాపారిని బెదిరించిన ఘటన మహారాష్ట్రలో జరిగింది. సదరు మహిళ ఒక స్టార్టప్ కంపెనీకి కో–ఓనర్ గా వ్యవహరిస్తోంది. ‘సోషల్ డిస్టెన్సింగ్ ఎ మిథ్ ఇన్ స్లమ్స్’ పేరుతో ఓ సామాజిక కార్యకర్త ఫేస్ బుక్ లో వీడియో పెట్టాడు. దీనిని చూసిన సదరు వ్యాపారి మెచ్చుకుంది. కానీ ఇష్యూ గురించి చెప్తూ కేర్ లెస్ గా వ్యాఖ్యానించినందుకు యాక్టివిస్ట్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్ చేసింది. దీంతో నెగిటివ్ కామెంట్ చేసినందని.. ఆమెను ట్రోల్ చేయాలంటూ ఓ నెటిజన్ తన ఫ్రెండ్స్ కు ట్యాగ్ చేశాడు. వాళ్లు అందరూ కలసి ఆమెను ట్రోల్ చేశారు. దీంతో వారిని బ్లాక్ చేసిన ఆమె .. ఇక్కడితో సమస్య ముగిసందని భావించింది. కానీ ఈనెల 24న ఐదుగురి నుంచి ఆమెకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. అసభ్య పదజాలంతో తిడుతూ, బెదిరిస్తూ కొందరు కాల్స్ చేశారు. నిందితులు తమకు సారీ చెప్పాలని, ఎఫ్ బీ నుంచి కామెంట్లను డిలీట్ చేయాలని బెదిరించారు. అలాగే ఆమె కంపెనీ వెబ్ సైట్ తోపాటు లింక్డ్ ఇన్ లో పరువునష్టం కలిగించే వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో ఉండే ఆమె బిజినెస్ పార్ట్ నర్ ను కూడా కాంటాక్ట్ అవ్వడానికి యత్నించారు. నిందితులపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Latest Updates