అలంబాగ్ టెర్మినల్ తరహాలో హైదరాబాద్ లో బస్టాండ్లు

లక్నో: ఆర్టీసీని బలోపేతం చేయడంపై సంస్థ దృష్టి పెట్టింది.లక్నోలోని ఆలంబాగ్ బస్ టెర్మినల్ తరహాలోనే హైదరాబాద్ లోనూ టెర్మినళ్లు నిర్మించాలని నిర్ణయించింది. అందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల లక్నో బస్ స్టేషన్ల తీరు తెన్నులను తెలుసుకునేందుకు టీఎస్ ఆర్టీసీ అధికారులు అక్కడ పర్యటించారు. దీనిపై త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు. ప్రభుత్వ ఆమోదిస్తే కొద్ది నెలల క్రితం గౌలిగూడలో కూలిన సీబీఎస్ ప్లేస్ లోనే 4.5 ఎకరాల్లో తొలి టెర్మినల్ ను నిర్మించేందుకు నిర్ణయించారు. అక్కడ కడితే ఇటు ఎంజీబీఎస్ కు, అటు మెట్రోకు దగ్గర్లో ఉండడంతో పాటు వ్యాపారానికి అనుకూలంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. తర్వాత జూబ్లీ బస్ స్టేషన్ కు సమీపంలోనూ 3.5 ఎకరాల్లో,ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని పాత ఎండీ కార్యాయం వద్ద దశల వారీగా వాణిజ్య సముదాయాలతో కూడిన బస్ టెర్మినళ్లు నిర్మిం చే అవకాశాలున్నాయి . వాటితో పాటు రాష్ట్రంలోని 23 బస్ స్టాం డ్లలో మినీ థియేటర్లను నిర్మించేందుకూ అధికారులు నిర్ణయించారు. ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆసిఫాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నిర్మల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కొల్లూరు, కొత్తగూడెం, సత్తుపల్లి , కరీంనగర్‌ , ధర్మపురి , జురాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సిరిసిల్ల,పెద్దపల్లి, జడ్చర్ల, షాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌ , నర్సా పూర్‌ , సంగారెడ్డి ,నాగార్జున సాగర్‌ , కోదాడ, ఆర్మూర్‌ , బోధన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, చేవెళ్ల,తాండూరు, వికారాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్టేషన్ ఘన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌ బస్ స్టాండ్లను ప్రాథమికంగా ఎంపిక చేశారు. 15 చోట్ల ఏర్పాటు చేసేం దుకు రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ ఇప్పటి కే ముం దుకొచ్చింది. ఇందుకోసం విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ , లక్నోలోని పలు బస్ స్టేషన్లలో ఉన్న మినీ థియేటర్లను అధికారులు పరిశీలించారు.

అంతర్జాతీయ హంగులతో ఆలంబాగ్ ..

అ లంబా గ్‌‌‌‌‌‌‌‌ బస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెర్మినల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అంతర్జా తీయ హంగులతో నిర్మిం చారు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం పద్ధతిలో షాలీమార్​ గ్రూప్ , యూపీఎస్ ఆర్టీసీ సంయుక్తంగా దానిని నిర్మించాయి. 26,500 చదరపు మీటర్ల స్థలంలో ₹232 కోట్లతో కట్టారు. అత్యున్నత ప్రమాణాలతో దేశంలోనే నంబర్‌ వన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్థానంలో నిలిచిందీ స్టేషన్ . 25 వేల మంది పట్టేలా దానిని నిర్మించారు. ఏసీ ఫుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లాజా, వీఐపీ లాంజ్, బ్యాం క్ , పోస్టాఫీస్, షాపింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాల్ , వైఫై, ఏసీ వెయిటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూమ్‌ , గేమింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోన్ , ఆరు స్క్రీన్ల మల్టీ ప్లెక్సు లు, ప్రపంచస్థాయి హోటల్, ఈటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాయింట్స్ తదితర అత్యాధునిక హంగులు ఉన్నాయి . 60 ప్లాట్ ఫాంలు, ఐదు లిఫ్టులున్నాయి . గ్రౌండ్ లెవల్‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 50, అండర్​ గ్రౌండ్ లో మరో 50 బస్సులను పార్కింగ్ చేసుకునే వెసులుబాటు కల్పిం చారు. స్టేషన్ ను మెట్రో సర్వీసు లకు లింక్ చేశారు.

Latest Updates