బటన్ మాస్క్ లొచ్చినయ్

ఒకప్పుడు మాస్క్ లంటే సాదా రంగుల్లో ఒకటి రెండు డిజైన్లనో మాత్రమే ఉండేవి. కానీ, ఇప్పుడు తీరొక్క డిజైన్లో బోలెడు మాస్క్ లు వచ్చాయి. డ్రెస్ కి మ్యాచింగ్ మాస్క్ కూడా ఫ్యాషనైంది ఈ మధ్య. కానీ ఎన్ని డిజైన్లొచ్చి నా వీటితో ఇబ్బందులు మాత్రం కామనే.. ఆ ఇబ్బందులకు చెక్ పెడుతూ మార్క్ ట్ లోని కొత్త రకం మాస్కులొచ్చాయి. కరోనా ఎఫెక్ట్ తో మాస్క్ లు కంపల్సరీ అయ్యాయి అందరికీ. కానీ, వీటిని ఎక్కువసేపు పెట్టుకోవడం వల్ల చాలా చర్మ సమస్యలొస్తున్నాయి. ఎలాస్టిక్, కాటన్ లూప్స్​ వల్ల చర్మం రాపిడికి గురయి చెవి నొప్పులు మొదలవుతాయి. చెవి చుట్టూ మచ్చలు కూడా ఏర్పడుతున్నాయి. అయినా సరే కరోనా భయంతో మాస్క్ లు పెట్టుకుంటున్నారు చాలామంది.

ముఖ్యంగా ఫ్రెంట్ లైన్ కార్మికులు ఈ సమస్యలతో బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వాళ్ల సమస్యలకి పరిష్కారంగానే మార్కెట్ లోకి బటన్ మాస్క్ లొచ్చాయి. కాటన్, ఎలాస్టిక్ బెల్ట్ లపై బటన్స్​తో వచ్చిన వీటితో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వీటిని ఉతికి తిరిగి వాడుకోవచ్చు కూడా. ఈ మాస్క్ లలో బోలెడు రకాలు ఇప్పుడు మార్కె ట్ లో అందుబాటులో ఉన్నాయి.

For More News..

నచ్చిన కోర్సులో సీటు రాక.. ఇష్టంలేని కోర్సు చదవలేక..

భూములు పాయే..  ప్రాజెక్టు పాయే.. కొలువులు రాకపాయే..

రూ. 170 కోసం దోస్తుల గొడవ.. ఒకరి మృతి

Latest Updates