గోల్డ్ రేట్ ఎంత ఉన్నాకొనేయండి

న్యూఢిల్లీ: బంగారం ధర ఎంత ఉన్నా కొనడం మానొద్దని ప్రముఖ ఇన్వెస్టర్‌‌‌‌ మార్క్‌‌‌‌ మొబియస్‌‌‌‌ స్పష్టం చేశారు. ఇది ఎంత ఎక్కువ ఉంటే భవిష్యత్‌‌‌‌లో అన్ని లాభాలు ఉంటాయని స్పష్టం చేశారు. కేంద్ర బ్యాంకులు ఎన్ని చర్యలు తీసుకున్నా, పెట్టుబడులపై లాభాలు రావడం లేదన్నారు. క్రిప్టోకరెన్సీల దూకుడు పెరుగుతున్నా, వాటిని నమ్మలేమని చెప్పారు. వీటన్నింటినీ పరిశీలిస్తే బంగారం వంటి వాటిపై పెట్టుబడులు మేలని మొబియస్‌‌‌‌ స్పష్టం చేశారు. పెట్టుబడుల్లో కనీసం పదిశాతమైన విలువైన లోహాల కొనుగోలుకు కేటాయించాలని సూచించారు. బడ్జెట్‌‌‌‌లో మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ఫలితంగా గత నెల నుంచి స్టాక్‌‌‌‌ మార్కెట్లు నష్టపోతున్నాయి. ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తున్న సంకేతాలు వస్తున్నాయి.  చైనా–అమెరికా వ్యాపార ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఫలితంగా మనదేశంలో బంగారానికి డిమాండ్‌‌‌‌ పెరిగింది. పది గ్రాముల ధర రూ.40 వేలకు చేరింది.

Latest Updates