తమ ఇళ్లని పూర్తి చేయాలంటూ కొనుగోలు దారుల నిరాహార దీక్ష

Buyers strike to construct their homes Wish town Township
  • ఈ నెల 19 నుంచి
  • దివాలా మొదలై 18 నెలలైం ది
  • ఇప్పటిదాకా బిడ్డర్‌ ను ఖరారు చేయలేదు
  • మాజీ ఛైర్మన్‌‌ లెటర్‌ తో  మండిపడుతున్న కొనుగోలుదారులు

నోయిడా: జేపీ విష్‌ టౌన్‌ లో ఇళ్లు కొనుక్కు న్న 1000 మంది ఏప్రిల్‌‌ 19 నుంచి నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు . వారు కొనుక్కు న్న ఇళ్లను కట్టే ప్రాజెక్టులో ఆలస్యానికి చింతిస్తున్నట్లు చెబుతూ,ఇటీవల జేపీ ఇన్‌ ఫ్రాటెక్‌ మాజీ ఛైర్మన్‌ మనోజ్‌గౌర్‌ లేఖ రాయడంతో కొనుగోలుదారులు ఈనిర్ణయం తీసుకున్నారు. డెలివరీలో ఆలస్యం నేపథ్యం లో చర్చలకు రావల్సిందిగా కొనుగోలుదారులను ఆయన పిలిచారు. ఇన్‌ సాల్వెన్సీ ప్రక్రియ మొదలై 18 నెలలు దాటుతున్నా ఈ టౌన్‌ షిప్‌‌లోని 22,500 ఇళ్ల నిర్మాణానికి ఇప్పటి దాకా బిడ్డరును ఖరారు చేయకపోవడం గమనార్హం. ఇన్‌ సాల్వెన్సీ ప్రక్రియ మొదలవడంతో తన పదవిని గౌర్‌ కోల్పోయారు. ఐతే, ఆదివారం శ్రీ రామనవమి సందర్భంగా కొనుగోలుదారులకు గౌర్‌ శుభాకాంక్షలు చెబుతూ పంపించిన సందేశంలోనే, సెక్టార్‌ 62లోని జేపీ బిజినెస్‌ స్కూల్‌‌లో ఒక రోజు సమావేశానికి రావాల్సిందిగా వారిని కోరారు. కొనుక్కున్న ఇళ్లను అందుకోవడానికి ఏళ్ల తరబడి వేచి వున్న నేపథ్యం లో తాను కూడా బాధపడుతున్నట్లు గౌర్‌ పేర్కొన్నారు. ఈ లెటర్‌ ను గౌర్‌ తన అధికారిక మెయిల్‌‌ ఎడ్రస్‌ నుంచే పంపించడం విశేషం.

కొనుగోలుదారులు మాత్రం గౌర్‌ లెటర్‌ పట్ల సానుకూలంగా లేరు. ఇన్‌ సాల్వెన్సీ  ప్రక్రియ ఒక పక్క కొనసాగుతుండగానే, మరోవైపు గౌర్‌ నుంచి ఈ లెటర్‌ రావడం తమకు ఆశ్చర్యం కలిగించిందని కొనుగోలుదారులు వ్యాఖ్యానించారు. ఇంటరిమ్‌ రిజొల్యూషన్‌ ప్రొఫెషనల్ నేతృత్వం లో న్యాయపరమైన చర్యలు కొనసాగుతుండగా, గౌర్‌ తమకు లెటర్‌ రాయడంలో ఔచిత్యాన్ని కొనుగోలుదారులు  ప్రశ్నిస్తున్నారు . ‘‘ఏప్రిల్‌‌ 19 న నిరాహార దీక్ష చేస్తాం. ఎందుకంటే, మమ్మల్ని మోసగించడమే కాకుండా, లెటర్లు పంపుతున్నారు . ఇంకా ఓపిక పట్టాలా ?’’అంటూ ప్రశ్నిం చారు ప్రమోద్‌‌ కుమార్‌ అనే కొనుగోలుదారుడు.

బిడ్‌లు వేసిన ఎన్‌బీసీసీ, సురక్ష…

పెండింగ్‌ లో ఉన్న జేపీ విష్‌టౌన్‌ టౌన్‌షిప్ నిర్మాణ ప్రాజెక్టును  చేజిక్కించుకోవడానికి రెండు కంపెనీలు బిడ్‌ లు దాఖలు చేశాయి. వాటిలో ఒకటి ప్రభుత్వ రంగానికి చెందిన నేషనల్‌‌‌‌ బిల్డింగ్‌ కన్‌ స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ కాగా, మరో కంపెనీ సురక్ష ఎసెట్‌ ‌‌‌రికన్‌ స్ట్రక్షన్‌ కంపెనీ. ఐతే,ఈ రెండింటిలో దేని బిడ్‌ను ఇంకా ఖరారుచేయలేదు. ఇన్‌ సాల్వెన్సీ  ప్రక్రియ గురించి పూర్తి వివరాలు చెప్పలేకపోయిన ఈ వర్గా లు, ప్రాజెక్టు తీరు తెన్ను లను గురించి మాత్రం వివరించాయి. సుమారు 15 వేల ఫ్లాట్స్‌‌‌‌ నిర్మాణం తుది దశకు చేరిం దని,అపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ల డెలివరీ కొనసాగుతోందని జేపీ గ్రూప్‌‌‌‌ అధికారి ఒకరు చెప్పారు. తాజాగా మరో బిడ్‌ ను దాఖలు చేసేందుకు మరిం త గడువు కావాలని ఇంటరిమ్‌రిజొల్యూషన్‌ ప్రొఫెషనల్‌‌‌‌(ఐఆర్‌ పీ)ను ఎన్‌ బీసీసీ కోరింది. ఐతే, ఐఆర్‌ పీ అనూప్‌‌‌‌ మిట్టల్‌‌‌‌ పదవీకాలం త్వరలోనే ముగియనుండటంతో, ఈ ప్రక్రియ మరింత ఆలస్యమవుతుం దని కొనుగోలుదారులు వాపోతున్నారు .

Latest Updates