BWF ర్యాంకింగ్స్ : శ్రీకాంత్ వరల్డ్ నంబర్ వన్

srikanth1 topబ్యాడ్మింటన్ స్టార్ కిదాంబి శ్రీకాంత్ వరల్డ్ నంబర్ వన్ స్థానాన్ని కైవ‌సం చేసుకున్నాడు. బ్యాడ్మింట‌న్ వ‌రల్డ్ ఫెడ‌రేష‌న్ విడుద‌ల చేసిన ర్యాంకింగ్స్‌ లో అత‌ను టాప్ ప్లేస్‌లో నిలిచాడు. భార‌తీయ బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్ల‌లో ఫ‌స్ట్ ర్యాంక్ సాధించిన రెండ‌వ ప్లేయ‌ర్‌ గా శ్రీకాంత్ నిలిచాడు. మాడ్ర‌న్ ర్యాంకింగ్స్‌ లో సైనా నెహ్వాల్ కూడా ఎలైట్ లిస్టులో ఉంది. పురుషుల విభాగంలో చైనా ప్లేయ‌ర్లు డామినేట్ చేసే బ్యాడ్మింట‌న్‌ లో ఇండియ‌న్ ష‌ట్ల‌ర్‌ కు నెంబ‌ర్ వ‌న్ ర్యాంక్ రావ‌డం గ‌ర్వ‌కార‌ణం.

ఇది నిజంగా దేశానికి ఎన‌లేని ప్ర‌తిష్ట‌ను తీసుకువ‌చ్చింది. ఇప్ప‌టికే కామ‌న్‌ వెల్త్ గేమ్స్‌ లో శ్రీకాంత్ జోరుమీదున్నాడు. లేటెస్ట్ ర్యాంకింగ్స్‌ లో శ్రీకాంత్‌ కు 76895 పాయింట్లు రాగా, డెన్మార్క్ ప్లేయ‌ర్‌ అలెక్స న్‌ కు 75470 పాయింట్లు వ‌చ్చాయి.

Posted in Uncategorized

Latest Updates