BWF వరల్డ్ టూర్ ఫైనల్ : చరిత్ర సృష్టించిన సింధు

BWF  వరల్డ్‌ టూర్ ఫైనల్స్‌ లో విక్టరీ సాధించింది పీవీ సింధు. ఆదివారం జరిగిన మ్యాచ్ లో జపాన్ క్రీడాకారిణి ఒకుహరాతో పోరాడి గెలిచింది. భారత బ్యాడ్మింటన్‌ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని ఘనతను అందుకుంది. ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైనా.. అలసిపోకుండా పోరాడి గెలిచింది. ఒకుహరాతో ను 21-19, 21-17 తేడాతో మట్టి కరిపించింది.

ఫస్ట్ సెట్ ను హోరాహారీగా గెలిచిన సింధు .. సెకండ్ సెట్ అదే శ్రమ తప్పలేదు. ఒకుహరా నుంచి సింధుకు తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఒక్కో పాయింట్  కోసం ఇద్దరూ తీవ్రంగా పోరాడారు. చెరొక పాయింట్  సాధిస్తూ వచ్చారు. రెండో రౌండ్ లో ఫస్ట్ 3-0 తేడాతో పైచేయి సాధించిన సింధు.. ఆ తర్వాత వరుసగా పాయింట్లు కోల్పోయింది. ఆ తర్వాత సింధు ఒక్కసారిగా విజృంభించింది. అద్భుత రిటర్న్ షాట్లతో రెండో గేమ్ తో పాటు మ్యాచ్ ను సొంతం చేసుకుంది.

Posted in Uncategorized

Latest Updates