పొరపాటున 28 టెస్లా కార్లను కొన్నడు!

బెర్లిన్: ఎంత ధనవంతుడైన ఒకే సా రి 28 టెస్లా కార్లను కొనా లనుకోడు. లేటెస్ట్ టెక్నాలజీ, డిజైన్, సూపర్‌ స్పీడ్ ఇంజన్ వంటి ఫీచర్లుం డడంతో వీటి ధర సా ధారణంగానే ఎక్కు వగా ఉంటుంది . కానీ జర్మనీలో ఒకాయన పొ రపాటున 28 టెస్లా కార్లకు ఆర్డర్‌ పెట్టేశాడు. ఆయన అకౌంట్‌నుంచి ఏకంగా1.4 మిలియన్‌ యూరోలు( రూ. 11 కోట్లు ) డిడక్ట్‌ అయిపోయాయి కూ డా. తన పా త ఫోర్డ్ క్రుగా కారును ఎక్స్చేంజీ ఇచ్చి టెస్లా మోడల్ 3 కారు ఒకటి కొందామని అనుకున్నాడు. టెస్లా వెబ్ సైట్లో అన్ని వివరాలూ నింపా క ‘కన్‌ఫర్మ్‌’ బటన్‌పై క్లిక్ చేశాడు. కొంతసేపు చూసినా, రె స్పాన్స్ రాకపోవడంతో వరసగా 28 సార్ లు మౌస్ నొక్కాడు. ఆ క్రమంలో ఎక్స్చేంజీ బటన్‌కు బదులు ‘పర్చేజింగ్ ’ ట్యా బ్ పై క్లిక్ చేశాడు. దీంతో 28 టెస్లా కార్లు బుక్‌ అయిపో-యాయి. సా ధారణంగా అయితే టెస్లా ఒకసారి ఆర్డర్ ఇచ్చి న కారుకు డబ్బు వాపసు ఇవ్వదు. ఇది అసాధారణ కేసు కాబట్టి రీఫండ్ ఇచ్చిందట.

Latest Updates