ప్రతి పేదవారికి పక్కా ఇల్లు : మోడీ

బిహార్ : ఇచ్చిన హామీలకు తాను కట్టుబడి ఉంటానని తెలిపారు ప్రధాని మోడీ. లోక్‌ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మంగళవారం బిహార్‌ ముజఫర్‌ పూర్‌ లో నిర్వహించిన ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ… ‘ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటాను. గ్రామీణ ప్రాంతంలోని ప్రతి పేదవాడికి సొంత పక్కా ఇల్లు ఉండేలా చేస్తాను. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సీట్లను కాంగ్రెస్ పార్టీ పొందలేదు. ప్రతిపక్షాలతో కలిసి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు.

కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని వారు కలలు కంటున్నారు. మా విధానాలు స్పష్టంగా ఉన్నాయి. కానీ, ప్రతిపక్ష పార్టీల విధానాలు సరిగ్గా లేవు.. ఉగ్రవాదాన్ని ఎలా నిర్మూలిస్తామన్న విషయాన్ని ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడైనా చెప్పాయా? మనల్ని హెచ్చరించిన వారి భూభాగంలోకి ప్రవేశించి, వారిని మట్టుబెట్టాం’ అని తెలిపారు.

 

Latest Updates