బ్యాలే డ్యాన్సు… ఇక నుంచి మగాళ్లది కూడా..

ఫలానా పని ఆడవాళ్లే చేయాలి. ఫలానా పని మగవాళ్లే చేయాలి. ఇలా ప్రతీ రంగంలోనూ జెండర్ బయాస్ కనిపిస్తోంది. కానీ, ఆ వివక్షే తన టాలెంట్ కు అడ్డుపడటాన్ని తట్టు కోలేకపోయాడు ఆంథోనీ మెసోమామదు. అందుకే ప్రొటెస్ట్‌‌‌‌‌‌‌‌ చేశాడు. ఆ నిరసన ఎట్లా అంటే.. జోరుగా వాన కురుస్తుండగా ఉత్త కాళ్లతో బ్యాలె డాన్స్ చేసి. పదకొండేళ్ల ఆ పిల్లాడు చేసిన డాన్స్ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది. అదే వీడియో అతని గోడును ప్రపంచానికి తెలియజేసేందుకు ఒక అవకాశం కల్పించింది.

‘‘బ్యాలె డాన్స్ అనేది కేవలం అమ్మాయిల కోసమే క్రియేట్ చేసింది అనుకుం టారు చాలామంది. కానీ, నాలాం టి వాళ్లను చూసినప్పుడే కదా బాలె ట్ డాన్స్ ని మగవాళ్లు కూడా ఇరగదీయగలరని తెలిసేది’’ అంటాడు ఆంథోనీ. వానలో కాన్ సన్ ట్రేషన్ తో అదీ కాళ్లకు షూస్‌‌‌‌‌‌‌‌ లేకుండా అతను చేసిన డాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యిం ది. ఎందరో సెలబ్రిటీలు ఆంథోనీ టాలెంట్‌‌‌‌‌‌‌‌ని తెగ మెచ్చుకున్నారు. తన వీడియో వైరల్ కావడంతో ఆ చిన్నారి ఎగ్జయిట్ అవుతున్నాడు . కానీ, ఆ చిన్నా రి కోరిక ఏంటంటే.. తన గురువు జీవితంలా తన కెరీర్ అవ్వకూడదని. లాగోస్ లో మొదటి మేల్ బ్యాలె డాన్సర్ డేనియల్ అజాలా . ఆ కెరీర్ అతనికి గుర్తింపు ఇవ్వలేకపోయింది. అందుకే స్టూ డెంట్స్ కి పాఠాలు చెబుతూ మాస్టర్ గా మారిపోయాడు. 2017లో లీప్ ఆఫ్ డాన్స్ అకాడమీ ఏర్పాటు చేశాడు. ఇంట్రెస్ట్ ఉండి డబ్బు లేని స్టూ డెంట్స్ కి ఫ్రీ కోచింగ్ ఇస్తుంటాడు. ప్రజెంట్ 12 మంది అతని దగ్గర బ్యాలె డాన్స్ నేర్చుకుంటున్నా రు. వాళ్లలో ఏకైక మేల్ స్టూ డెంట్ ఆంథోనీ. శిష్యుడికి గుర్తింపు దక్కడంపై సంతోషం పడుతున్న డేనియల్.. టాలెంట్ ఏ ఒక్కరి సొత్తు కాదని చెబుతున్నాడు.

Latest Updates