టీమిండియా జెర్సీ: ఒప్పో స్థానంలో కొత్త బ్రాండ్

త్వ‌ర‌లో టీమిండియా జెర్సీ బ్రాండ్ మార‌నున్నంది. ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగే సిరీస్ నుంచి టీమిండియా ఆటగాళ్ల జెర్సీలపై ఒప్పో బ్రాండ్‌కు బ‌దులు కొత్త బ్రాండ్ ద‌ర్శ‌న‌మివ్వ‌నుంది. ప్ర‌స్తుతం టీమిండియాకు స్పాన్స‌ర్ చేస్తున్న చైనాకు చెందిన మొబైల్ సంస్థ ఒప్పో స్పాన్సర్‌షిప్‌ను ర‌ద్చు చేసుకుంటున్న‌ట్లు స‌మాచారం.

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ సంస్థ ఒప్పో.. 2017 మార్చిలో టీమిండియా స్పాన్సర్‌షిప్‌ను రూ.1079 కోట్లకు ఐదేళ్ల పాటు BCCIతో  అగ్రిమెంట్ కుదుర్చుకుంది. అయితే ఒప్పో సంస్థ తమ స్పాన్సర్‌షిప్‌ను రద్దు చేసుకుందని, 2017లో అధిక వ్యయానికి ఒప్పందం కుదుర్చుకున్నామనే కారణంతో తప్పుకోవాలని చూస్తోందట. అంత మొత్తంలో తాము చెల్లించలేమనే ఒప్పో తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఒప్పో స్థానంలో అదే టైం పిరియడ్ కి అంతే మొత్తంలో బీసీసీఐకి చెల్లించడానికి ముందుకు వచ్చింది బెంగళూరుకు చెందిన ఆన్‌లైన్‌ ట్యుటోరియల్‌ సంస్థ బైజుస్‌  సంస్థ‌.

సెప్టెంబర్‌ 15న ప్రారంభమయ్యే దక్షిణాఫ్రికా పర్యటన నుంచి బైజుస్‌ తన బ్రాండ్‌ను కొనసాగించనుంది.

Latest Updates