మైనార్టీల ఓట్ల కోసమే సీఏఏపై తీర్మానం

మైనార్టీల ఓట్ల కోసమే సీఏఏపై తీర్మానం
అద్దంకి దయాకర్, బెల్లయ్య నాయక్

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌‌‌‌ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీర్మానం కేవలం మజ్లిస్‌‌‌‌ పార్టీ, ముస్లింల ఓట్ల కోసమేనని టీపీసీసీ అధికార ప్రతినిధులు అద్దంకి దయాకర్‌‌‌‌, బెల్లయ్య నాయక్‌‌‌‌ విమర్శించారు.మంగళవారం గాంధీభవన్‌‌‌‌లో వారు మీడియాతో మాట్లాడుతూ.. ఆ తీర్మానం వ్యతిరేకించడానికి తప్ప మరెందుకు ఉపయోగపడదన్నారు. బీజేపీ చేస్తున్న కుట్రలను టీఆర్ఎస్ ఎలా అడ్డుకుంటుందో చెప్పాలన్నారు. కేంద్రం మతాల మధ్య చిచ్చు పెట్టడానికి చట్టాలు చేస్తోందని ఆరోపించారు. 2014 మార్చి 31 నాటికి దేశంలో ఉన్న వారంతా భారతీయులేనని కేంద్రం ప్రకటించిందని, మరి మళ్లీ ధ్రువీకరణ ఎందుకని ప్రశ్నించారు.

See Alos: ఫీల్డ్​ అసిస్టెంట్లపై ప్రభుత్వం కఠిన నిర్ణయం

రైతు రుణమాఫీ: అర్హులను ఇలా గుర్తిస్తారు

ఇంటర్​ క్వశ్చన్ ​పేపర్లలో తప్పులే తప్పులు

 నిజామాబాద్ ఎమ్మెల్సీ బరిలో కవిత

Latest Updates