క్యాబ్ డ్రైవర్ మాటలకు కాజల్ మనసు కదిలిపోయిందట..!

అందమైన అమ్మాయిలు చాలామంది ఉంటారు. కానీ కాజల్ అందమైన రూపమే కాదు, అంతకంటే అందమైన మనసు కూడా ఉందంటూ పొగడ్తలతో ముంచెత్తుతు న్నారు నెటిజన్స్. దానికి కారణం.. రీసెంట్ గా ఆమె పెట్టిన పోస్ట్. కరోనా సృష్టించిన కల్లోలం గురించి అందరూ స్పందిస్తున్నారు. జాగ్రత్తగా ఉండమంటూ సూచనలిస్తున్నారు. అయితే కాజల్‌ తన అనుభవాన్ని పోస్ట్ చేసింది. ఆమె ఒక క్యాబ్ ఎక్కిందంట. ఆ డ్రైవర్‌ కాజల్ తో ‘ఈ రోజు మీరే నా మొదటి కస్టమర్.
ఇంట్లోకి కూరగాయలు, వంట సామగ్రి తెస్తానని నా భార్య ఎదురు చూస్తుందో ఏమో’ అంటూ ఆవేదన చెందాడట. దాంతో కాజల్ మనసు
కదిలిపోయిందట.

‘అతని పరిస్థితిచూసి నాకు చాలా జాలేసింది. అందుకే అతనికి ఐదొందలు ఎక్కువ ఇచ్చాను. మనకిది చిన్న మొత్తమే అయ్యుండొచ్చు.  కానీ వారి అవసరాలు తీరతాయి కదా. మీరు కూడా ఇలాంటివాళ్లు ఎదురైతే కాస్త ఎక్కువ ఇవ్వండి. మీరే వాళ్ల చివరి కస్టమర్ అయ్యుండొచ్చు కదా’ అంది కాజల్. అది చదివినవారంతా కాజల్ ది ఎంత మంచి మనసో అంటూ మెచ్చుకున్నారు. తప్పకుండా మా వంతు సాయం చేస్తామంటూ మాటిచ్చారు.

Latest Updates