కేంద్రం పూర్తి ఆరోగ్యవంతుడికి ఆపరేషన్ చేస్తోంది

  • సిటిజన్‌షిప్ బిల్లుపై కేంద్రాన్ని తప్పుబట్టిన కమల్

మంచిగా ఆరోగ్యంతో ఉన్న వ్యక్తికి ఆపరేషన్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం పెద్ద నేరం చేస్తోందంటూ మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు, హీరో కమల్ హాసన్ అన్నారు. సిటిజన్‌షిప్ చట్ట సవరణ బిల్లుపై కేంద్రాన్ని తప్పుబడుతూ ఇలా కామెంట్ చేశారాయన.

రాజ్యాంగంలో ఏవైనా తప్పులు ఉంటే సవరించడం మన బాధ్యత అని కమల్ హాసన్ అన్నారు. కానీ, ఏ లోపం లేని రాజ్యాంగాన్ని మార్చడం నయవంచన అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఇప్పుడు చేస్తున్న పని అదేనన్నారు.

సిటిజన్‌షిప్ అమెండ్‌మెంట్ బిల్లు తేవడం ద్వారా భారత్‌ను ఒక జాతికి మాత్రమే పరిమితమైన దేశంగా మార్చాలనుకోవడం స్టుపిడ్ పని అని అన్నారు. ఇది సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న వ్యక్తికి ఆపరేషన్ చేయడమేనని, ఇలాంటి ప్రయత్నం చేసి.. ఫెయిల్ అయ్యి మళ్లీ అదేపని చేస్తున్నారంటూ కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కమల్. ఇప్పుడున్నది పురాతన కాలం నాటి భారత్ కాదని, నేటి యువ భారతం ఇలాంటి చర్యలను తిప్పికొడుతుందని హెచ్చరించారు.

Latest Updates