CAAకు వ్యతిరేకంగా ధర్నా.. హెచ్ సీయూ విద్యార్ధుల అరెస్ట్

మొయినబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రికత్త నెలకొంది. పౌరసత్వం బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా చేపట్టారు.  CAA, Nrcలను వ్యతిరేకిస్తూ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ధర్నా చేసేందుకు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు పెద్దఎత్తున తరలివచ్చారు.

సమాచారం అందుకున్న పోలీసులు విద్యార్ధుల్ని మెయినాద్  స్టేషన్ కు తరలించారు.అయితే ధర్నా చేసేందుకు వెళుతున్న పోలీసులు తమని అక్రమంగా అడ్డుకొని అరెస్ట్ చేశారని అన్నారు. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధంగా ఉందని వెంటనే వెనక్కి తీసుకోవాలని అన్నారు తాము న్యాయంగా ధర్నా చేస్తుంటే పోలీసులు మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి ఇక్కడకి తరలించారని ఆవేదన వ్యక్తంచేశారు. Cab, Nrc బిల్లులను వెనక్కితీసుకోవాలని కేంద్రం, తెలంగాణ ప్రభుత్వానికివ్యతిరేకంగా నినాధాలు చేశారు. ప్లకార్డ్ లతో నిరసన తెలిపారు.

Latest Updates