క్యాన్సర్‌ పై క్యాబేజీ ఫైట్‌

ఫైట్‌‌ క్యాబేజీలోని ఔషధ గుణాల గురించి తెలిస్తే కచ్చితంగా ఆహారంలో భాగం చేసుకుంటారు. పేగు క్యాన్సర్‌ ను క్యాబేజీ దరిచేరనివ్వకపోవడమే కాకుండా, రోగ నిరోధకశక్తిని పెంచుతుందని పరిశోధనల్లో వెల్లడైంది. క్యాబేజీ, బ్రకోలీ, కేల్‌ లోని ఔషధిక రసాయనాలు కడుపును, పేగులను ఆరోగ్యవంతంగా ఉంచుతుందని వెల్లడైంది. క్యాబేజీని ఆహారంగా తీసుకుంటే ‘ఇండోల్‌ -3-కార్బినోల్‌ (ఐ3సీ)’ అనే రసాయనం విడుదలవుతుంది. అది పెద్దపేగు క్యాన్సర్‌ ను నివారిస్తుం ది. ఆ విషయం ఇప్పటికే నిర్ధారణ అయినా, దాని వెనక ఉన్న ఆంతర్యమేంటో తెలియదు. దాన్నే ఇప్పుడు పరిశోధకులు ఛేదించారు. కడుపులో ఉండే అరైల్‌ హైడ్రోకార్బన్‌ రిసెప్టర్‌ (ఏహెచ్‌ ఆర్‌ ) అనే ప్రొటీన్‌ ను ఐ3సీ ప్రేరేపిస్తుందని గుర్తించారు. సెన్సర్‌ లా పనిచేసే ఈ ప్రొటీన్‌ , ఇన్‌ ఫ్లమేషన్‌ , క్యాన్సర్‌ నుంచి కాపాడేలా రోగనిరోధక కణాలు, ఎపిథీలియల్‌ (కండర) కణాలకు సంకేతాలను పంపిస్తుంది. తద్వారా ఆ క్యాన్సర్‌ కారక కణాలను రోగనిరోధక కణాలు అడ్డుకుని పేగు క్యాన్సర్‌ దరిచేరకుండా కాపాడుతుంది.

 

Latest Updates