ఇప్పటికైనా మంత్రులకు అధికారమివ్వండి: కోదండరాం

హైదరాబాద్‌, వెలుగు: మంత్రులను బానిసలుగా, ఉత్సవ విగ్రహాలుగా మార్చొద్దని సీఎం కేసీఆర్‌కు టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం సూచించారు. తండ్రీకొడుకుతో పాటు మిగతా 16  మంది మంత్రులకు ఇప్పటినుంచైనా హక్కులు, అధికారాలిస్తే బాధ్యతగా పని చేస్తారన్నారు. రాష్ట్ర కేబినెట్‌ కూర్పుపై కోదండరాం ఆదివారం మాట్లాడారు. రెండోసారి టీఆర్ఎస్‌ అధికారంలోకి వచ్చిన 7 నెలల తర్వాత పూర్తి స్థాయిలో మంత్రివర్గం ఏర్పడటం, తొలిసారి మహిళలకు చోటు దక్కడం మినహా కూర్పులో విశేషమేం లేదన్నారు. జన జీవితాన్ని ఆర్థిక మాంద్యం అల్లకల్లోలం చేయడం.. పార్టీలో, కుటుంబంలో ముదిరిన సంక్షోభం, దివాళా తీసిన ఖజానా, మరీ ముఖ్యంగా ఈటల, రసమయి లాంటి నేతలకు జరిగిన అవమానంపై పెల్లుబుకిన ప్రజాగ్రహం -నుంచి ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నమే కేబినెట్ విస్తరణ అన్నారు.

Cabinet expansion is an attempt to distract the public says Kodandaram

Latest Updates