కోచ్‌‌‌‌ సెలెక్షన్‌‌‌‌కు రూట్‌‌‌‌ క్లియర్‌‌‌‌

  •  ‘కాన్‌‌‌‌ఫ్లిక్ట్‌‌‌‌’లో కపిల్‌‌‌‌ కమిటీకి సీఓఏ క్లియరెన్స్‌‌‌‌

టీమిండియాకు కోచ్‌‌‌‌ను ఎంపిక చేసేందుకు కపిల్‌‌‌‌ దేవ్‌‌‌‌ నేతృత్వంలోని క్రికెట్‌‌‌‌ అడ్వైజరీ కమిటీ (సీఏసీ)కి మార్గం సుగమమైంది. కాన్‌‌‌‌ఫ్లిక్ట్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ఇంటరెస్ట్‌‌‌‌ (విరుద్ధ ప్రయోజనాల) అంశంలో కమిటీకి  బీసీసీఐ కమిటీ ఆఫ్‌‌‌‌ అడ్మినిస్ట్రేటర్స్‌‌‌‌ క్లియరెన్స్‌‌‌‌ ఇచ్చింది.  కపిల్‌‌‌‌తో పాటు సీఏసీ సభ్యులు సమర్పించిన డిక్లరేషన్స్‌‌‌‌ను పరిశీలించామని, అన్నీ క్లియర్‌‌‌‌గా ఉన్నట్టు సీఓఏ చీఫ్‌‌‌‌ వినోద్‌‌‌‌ రాయ్‌‌‌‌ తెలిపారు.  షార్ట్‌‌‌‌లిస్ట్‌‌‌‌ చేసిన అభ్యర్థులను ఈ నెల మధ్యలో కపిల్‌‌‌‌ కమిటీ ఇంటర్వ్యూలు చేస్తుందన్నారు. ఆ తర్వాత హెడ్‌‌‌‌ కోచ్‌‌‌‌, సపోర్ట్‌‌‌‌ స్టాఫ్‌‌‌‌ను ప్రకటిస్తారని చెప్పారు. కోచ్‌‌‌‌ ఎంపికలో సీఏసీ నిర్ణయమే ఫైనల్‌‌‌‌ అని రాయ్‌‌‌‌ స్పష్టం చేశారు. అక్టోబర్‌‌‌‌ 22న బీసీసీఐ ఎలక్షన్స్‌‌‌‌ జరగనున్న నేపథ్యంలో 26  స్టేట్‌‌‌‌ అసోసియేషన్స్‌‌‌‌ లోధా సిఫారులను పూర్తిగా ఆమోదించాయని చెప్పారు.

Latest Updates