10,811 ఉద్యోగాలకు కాగ్‌ నోటిఫికేష‌న్ జారీ

కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా(CAG )… 10,811 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. ఇందులో ఆడిటర్ పోస్టులు 6409 కాగా.. అకౌంటెంట్ పోస్టులు 4402. ఈ పోస్టుల‌కు బ్యాచిల‌ర్ డిగ్రీ అర్హత ఉన్నవారు మాత్రమే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. అభ్య‌ర్థి వ‌య‌సు 18 నుంచి 27 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు రూ. 29,200 నుంచి రూ.92,300 వరకు వేతనం  అంద‌నుంది. ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్ల పాటు ప్రొహిబిషన్ పిరియడ్ ఉంటుంది.

ఇందులోఆంధ్రప్రదేశ్ లో 144ఆడిట‌ర్ పోస్టులు ఉండ‌గా.. తెలంగాణ‌లో 220 పోస్టులు ఉన్నాయి. ఇక ఏపీలో 120 అకౌంటెంట్ పోస్టులు ఉండ‌గా.. తెలంగాణ‌లో 132 పోస్టులు ఉన్నాయి. అర్హులైన అభ్య‌ర్థులు ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌నుకునే వారు అధికారిక వెబ్ సైట్ https://cag.gov.in/en లోకి వెళ్లి CAG ఆడిట‌ర్‌, అకౌంటెంట్ ద‌ర‌ఖాస్తు ఫారం 2021ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఫార‌మ్‌ను నింపి ఇచ్చిన చిరునామాకి 19 ఫిబ్ర‌వ‌రి 2021 లోపు పంపాల్సిందిగా సూచించింది కాగ్.

Latest Updates