తెరపైకి బ్యాన్ రచ్చ: వారం రోజులు అమెజాన్ ను బ్యాన్ చేయాలని డిమాండ్

అమెజాన్ తో పాటు ఇతర ఇ -‌‌కామర్స్ సంస్థల్ని నిషేదించాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) డిమాండ్ చేస్తుంది. కంట్రీ ఆఫ్ ఆరిజిన్ కింద ఆయా ఇ -‌‌కామర్స్ కంపెనీలు తమ ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్ లో డిస్ ప్లే చేసే ఉత్పత్తుల వివరాల్ని అందించాలి. కానీ అమెజాన్ ఇండియా అలా వివరాల్ని అందించకపోవడంతో కేంద్రం  ఆగ్రహం వ్యక్తం చేస్తూ రూ.25వేలు జరిమానా విధించింది. అయితే ఈ జరిమానాపై సీఏఐటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెజాన్ ఇండియాకు రూ.25వేల ఫైన్ సరిపోదని , వారం రోజుల పాటు బ్యాన్ చేయాలని డిమాండ్ చేసింది. నియమాలు,విధానాల్ని ఉల్లంఘించినందుకు అమెజాన్ ను తాత్కాలిక బ్యాన్ కు పట్టుబట్టింది. మరి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్  డిమాండ్ పై కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది.

 

Latest Updates