
భార్య పుట్టిన రోజున సర్ప్రైజ్ చేయాలని ప్రతి భర్తా అనుకుంటాడు. అమెరికాకు చెందిన ఓ వ్యక్తి కూడా అలాగే అలోచించాడు. శ్రీమతికి కొత్తరకం బహుమతి ఇచ్చాడు. ఆన్లైన్ షాపింగ్‌ను ఎంతో ఇష్టపడే భార్య ఎమిలీ మెక్గుయ్రేకు అమెజాన్‌ను నుంచి ఓ గిఫ్ట్ బాక్స్ తెప్పించాడు. దాన్ని చూడగానే ఆమె ఒక్క సెకన్ ఆశ్చర్యపోయింది. నమ్మలేకపోయింది. తర్వాత ముచ్చట పడింది. అంతలా ఏముంది ఆ బాక్సులో అనుకోవచ్చు. ఆ బాక్సులో ఏం లేదు? అసలు అది బాక్సే కాదు. బాక్సు లాంటి కేక్. వేడుకలో దాన్ని కట్ చేసే వరకూ ఎవరూ గుర్తుపట్టలేకపోయారు. అంతలా సూపర్‌గా రెడీ చేసింది ‘డన్’లోని స్వీట్ డ్రీమ్స్ బేకరీ. అచ్చం అమెజాన్ బాక్సులాగే డిజైన్ చేసింది. కేక్ ఫొటోలను ఎమిలీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అవి బాగా వైరలవుతున్నాయి.