పోటీ పరీక్షలకు కాల్కస్‌‌ ఇండియా యాప్‌‌

పోటీ పరీక్షలకు కాల్కస్‌‌ ఇండియా యాప్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: స్కూల్‌ స్థాయి నుంచి సివిల్స్‌‌ ఎగ్జామ్స్‌‌ ప్రిపరేషన్‌‌ వరకు ఉపయోగపడే  కంటెంట్‌‌ను కాల్కస్‌‌ ఇండియా యాప్‌‌లో అందుబాటులోకి తెచ్చింది కాల్కస్‌‌ ఇండియా ఎడ్యుకేషనల్‌‌ ఇన్‌‌స్టిట్యూట్‌‌.  ఉదాహరణకు 3వ తరగతి నుంచి ఇంటర్‌‌ సెకండ్‌‌ ఇయర్‌‌ వరకు దేశంలోని అన్ని ప్రముఖ బోర్డు పరీక్షల నుంచి 8, 607 టెస్ట్‌‌ పేపర్లను ఈ యాప్‌‌లో పొందుపరిచారు. వీటితో పాటు ఇంజనీరింగ్, మెడికల్, ఎంసెట్, పోలీస్‌‌, డిఫెన్స్, మేనేజ్‌‌మెంట్, బ్యాంకింగ్, టీచింగ్, గవర్నమెంట్, సివిల్స్‌‌ ఎంట్రన్స్ వంటి మరెన్నో కాంపిటేటివ్‌‌ ఎగ్జామ్స్‌‌కు  సిద్ధమయ్యే వారి కోసం స్పెషల్ బండిల్‌‌ రూపంలో కంటెంట్‌‌ను ఈ  యాప్ అందిస్తోంది. ఇందులో క్వశ్చన్స్‌‌తో పాటు ఆన్సర్స్‌‌ను కూడా ఉంచారు. రూ. 99కే ఈ బండిల్‌‌ను యాక్సెస్‌‌ చేసుకోవచ్చు.