మాట్లాడుదామని పిలిచి కొట్టిండు

రిపోర్టర్ పై టీఆర్ఎస్ నాయకుడి దాడి

హైదరాబాద్, వెలుగు: రిపోర్టర్ పై టీఆర్ఎస్ నాయకుడు దాడి చేసిన ఘటన జగద్గరిగుట్ట పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్ స్పెక్టర్ గంగాధర్ రెడ్డి తెలిపిన ప్రకారం… ఎల్లమ్మబండలో నివసించే జి.రవికుమార్ ఓ పత్రికలో రిపోర్టర్. ఆదివారం సాయంత్రం ఒక వాట్సా ప్ గ్రూప్ లో జరిగిన చర్చపై రవికుమార్ , టీఆర్ఎస్ నాయకుడు డి. అనిల్ రెడ్డి మధ్య వాగ్వాదానికి దారి తీసింది. రాత్రి 10 గంటల సమయంలో అనిల్ రెడ్డి ఫోన్ చేసి మాట్లాడాలని ఎల్లమ్మబండ చౌరస్తా వద్దకు పిలిచాడు. రవికుమార్ మరో యువకుడితో కలిసి బైక్ పై వెళ్లాడు. అక్కడ అన్నదమ్ములు అనిల్ రెడ్డి, సతీశ్ రెడ్డి కలిసి దాడి చేయడంతో రవికుమార్ కు కాలు ఫ్రాక్చర్ అయింది. బాధితుడి కంప్లయింట్ తో జగద్గిరిగుట్ట ఇన్ స్పెక్టర్ అట్రాసిటీ కింద కేసు ఫైల్ చేశారు.

Latest Updates