సెల్‌ఫోన్లు దగ్గుతున్నయ్

ఎవరికైనా ఫోన్​చేస్తే.. ఎవరో దగ్గుతున్న శబ్దంతో మొదలై వాయిస్ వినిపిస్తోందా? కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజల్లో అవగాహన కోసమని టెలికం కంపెనీలు తెచ్చిన కాలర్​ ట్యూన్​ అది. ఏ నెట్ వర్క్​ నుంచి మరే నెట్ వర్క్​ నంబర్​కు కాల్​ చేసినా.. ఈ కరోనా అలర్ట్​ ట్యూన్​ వినిపిస్తోంది. ముందు ఎవరో దగ్గుతున్న శబ్ధం వినిపిస్తుంది. తర్వాత ఇంగ్లిష్ లేదా హిందీ భాషలో.. ‘‘కరోనా వైరస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి. దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు మీ ముఖానికి కర్చీఫ్ లేదా టిష్యూ అడ్డు పెట్టుకోండి. చేతులతో కళ్లు, నోరు, ముఖంపై తాకకండి. ఎవరికైనా దగ్గు, జ్వరం లేదా ఊపిరి అందకపోవడం వంటి సమస్యలు ఉంటే వారి నుంచి కొంత దూరంగా ఉండండి. శానిటైజర్​తో చేతులు శుభ్రం చేసుకోండి. అవసరమైతే హెల్ప్‌‌లైన్ నంబర్‌లో సంప్రదించండి”అని చెప్తోంది.

Latest Updates