కార్మికుల కోసం హైవేలపై క్యాంపులు

అన్ని హైవేలలో ఏర్పాటు
మున్సిపాలిటీల ఆధ్వర్యంలో నిర్వహణ

హైదరాబాద్, వెలుగు: ఇతర రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి వచ్చిన పేదలు, వలస కార్మికులు, పారిశ్రామిక కార్మికుల కుటుంబాలు ఎక్కడివారు అక్కడే ఉండే విధంగా మున్సిపల్ శాఖ ఏర్పాట్లుచేసింది. లాక్‌‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలు ప్రస్తుతం ఉన్నచోటు నుంచి కదిలే అవసరం లేకుండా పోలీసు శాఖ సమన్వయంతో క్యాంపులను నిర్వహిస్తోంది. నేషనల్ హైవేలు, స్టేట్ హైవేల వెంట ఉన్న మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో ప్రభుత్వ భవనాలను, ఫంక్షన్ హాళ్లను వీరి కోసం క్యాంపులుగా మార్చినట్లు తెలిపింది. అన్ని క్యాంపులలో పేదలకు ‘అన్నపూర్ణ’
భోజనం అందిస్తోంది. లాక్‌‌డౌన్‌ కారణంగా సొంత ఊర్లకు కాలినకడకన వెళ్తున్న వారిని గుర్తించి క్యాంపులకు తరలిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ రహదారులపై ఆదివారం కాలినడకన ప్రయాణం చేస్తున్న దాదాపు ఐదు వేల మందిని పోలీసులు, మున్సిపల్ అధికారులు గుర్తించి క్యాంపులకు తరలించారు. మున్సిపల్ శాఖ అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లకు ఈ బాధ్యతలను అప్పగించింది. మహారాష్ట్రలోని లాతూరు నుంచి ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, ప్రకాశం, తూర్పు గోదావరి జిల్లాలకు కాలినడకన ప్రయాణం చేస్తున్న 39 మంది స్టూడెంట్లను రంగారెడ్డి జిల్లా బొంగ్లూరు పోలీస్ పికెటింగ్ వద్ద గుర్తించారు. వారిని పటేల్ గూడ జిల్లాపరిషత్ హైస్కూల్లో ఏర్పాటుచేసిన క్యాంపునకు తరలించారు. మెడికల్ డిపార్టుమెంట్ స్టాఫ్ సోమవారం ఉదయం వీరందరికీ టెస్టులు చేశారు. ప్రభుత్వంనుంచి ఆదేశాలు వచ్చేంతవరకు వారు అక్కడే ఉండేలా ఏర్పాట్లు చేశారు.

For More News..

కరోనా వచ్చిందని ఆస్పత్రికి పంపి … 55 కి.మీ. నడిపించిన్రు

ఐడీ కార్డు చూపించినా.. ఇష్ట మొచ్చినట్టు కొట్టిన్రు

రాష్ట్రంలో కరోనాతో ఆరుగురు మృతి

Latest Updates