చద్దన్నం వేడి చేస్తే విషంగా మారుతుందా?

అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు పెద్దలు. ఆ మాటను ఇప్పటికీ తూ.చ. తప్పకుండా చాలామంది పాటిస్తున్నారు. ఎందుకంటే.. తిండి లేక ఆకలితో పస్తులుంటున్న వారు ఇప్పటికీ ఎంతోమంది ఉన్నారు. ఆకలితో చచ్చిపోయే వాళ్ల సంఖ్య కూడా తక్కువేం లేదు. అయితే.. రాత్రి వండిన అన్నాన్ని ఉదయాన్నే మళ్లీ వేడి చేసి తినే అలవాటు చాలామందికి ఉండే ఉంటుంది. ‘రెండు రెక్కలు ముక్కలు చేసుకుంటేనే.. నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్తాయి. అలాంటిది.. కష్టపడి సంపాదించిన అన్నాన్ని పారేస్తామా.. వేడి చేసుకొని తింటే సరి’ అనే మాటలు రెగ్యులర్​గా మనకు వినిపిస్తూనే ఉంటాయి. ఒకరకంగా ఇది నిజమే అయినప్పటికీ ఒకప్పటి ఆరోగ్య పరిస్థితులు, ఆనాటి వంటకాలు.. ఇప్పటి ఆరోగ్య పరిస్థితి, ఇప్పటి వంటకాలకు చాలా తేడా వచ్చింది. అందుకే.. అన్నం వేడి చేస్తే విషపూరితంగా మారుతుందని స్టడీస్​ చెప్తున్నాయి.

అసలేం జరుగుతుంది?

ప్రతీ ఆహార పదార్థంలో టాక్సిన్లు ఉంటాయి. అంతెందుకూ.. మన శరీరంలో కూడా టాక్సిన్లు ఉంటాయి. కాకపోతే.. అవి సమయాన్ని బట్టి స్పందిస్తుంటాయి. విషపూరితమైన ఈ టాక్సిన్లు కొన్నిసార్లు ప్రాణాంతకంగా మారతాయి. కొన్నిసార్లు అనారోగ్యానికి కారణమవుతాయి. అయితే.. చాలా రకాల ఆహార పదార్థాలు, వంటకాలు ఒకరోజు గడిచిన తర్వాత బ్యాక్టీరియాలకు నివాసాలుగా మారతాయి. ఇవి కొన్ని రకాల టాక్సిన్లను విడుదల చేస్తుంటాయి. అమెరికాకు చెందిన యునైటెడ్​ స్టేట్స్​ డిపార్ట్​మెంట్​ ఆఫ్​ అగ్రికల్చర్​కు సంబంధించిన సైంటిస్టులు ఈ విషయాన్ని పలు అధ్యయనాలు చేసి మరీ ప్రకటించారు. అన్నాన్ని వేడి చేయడం వల్ల అందులోని బ్యాక్టీరియా  విడుదల చేసే టాక్సిన్ల వల్ల వాంతులు, డయేరియా వంటి అనారోగ్యాలకు కారణమవుతాయి.

పెద్దలేమన్నారు?

చద్దన్నంలో ఉన్న ప్రయోజనాలు మరెందులోనూ లేవన్నారు పెద్దలు. అవును నిజమే.. రాత్రి మిగిలిన చద్దన్నంలో పెరుగు కలిపి ఉదయాన్నే తింటే.. ఎముక పుష్టి పెరుగుతుంది. ఇంకా ఎన్నో రకాల ఆరోగ్య ఉపయోగాలున్నాయి. మరి అమెరికన్​ అగ్రికల్చర్​ డిపార్ట్​మెంట్​ ఎందుకు అలా చెప్పింది అని ఆలోచిస్తే.. దానికి చాలా కారణాలున్నాయి. అవేంటంటే.. ప్రస్తుత బిజీలైఫ్​లో అందరూ మైక్రోఒవెన్​ వంటలకు అలవాటు పడ్డారు. అన్నం వండాల్సి వస్తే.. బియ్యం కడిగి.. రైస్​కుక్కర్​లో పెట్టేసి మిగతా పనులు చూసుకుంటున్నారు. రైస్​ కాస్త స్టీమ్​ అవగానే వచ్చే అలర్ట్​తో కుక్కర్​ బంద్​ చేస్తున్నారు. ఇలా వండిన అన్నం తొందరగా పాడవుతుంది. ఒకవేళ పాడవకపోయినా.. అప్పటికే అందులో రకరకాల బ్యాక్టీరియాలు చేరి ఉంటాయి. అప్పుడు గనక ఆ అన్నాన్ని వేడి చేసి తింటే.. అందులోని బ్యాక్టీరియాల కారణంగా టాక్సిన్లు విడుదలై ఆ అన్నం విషపదార్థంలా మారుతుందనేది అమెరికన్​ అగ్రికల్చర్​ డిపార్ట్​మెంట్ పరిశోధన సారాంశం. అయితే.. ఇప్పుడేం చేద్దాం? మునుపటిలా వంటపాత్రల్లో అన్నం వండుకునేంత తీరిక లేదు.. టైమ్​ లేదు. చాలామంది ఆ పద్ధతులు కూడా మర్చిపోయి ఉంటారు. ఏం పర్లేదు. ప్రతీ సమస్యకు పరిష్కారంతో పాటు.. వేరే దారి కూడా ఉంటుంది. అందుకే.. అమెరికన్​ అగ్రి కల్చర్​ డిపార్ట్​మెంట్​ఈ  సూచనలు చేశారు.

ఇలా చేస్తే సరి..

  • అన్నం వండేటప్పుడు బియ్యం పూర్తిగా ఉడికే వరకు ఉండనివ్వాలి.
  • వీలైనంత వరకు అందరికీ సరిపోయేంత అన్నం మాత్రమే వండుకుంటే బెటర్​. ఎక్కువ వండేసి.. ఆ తర్వాత దాన్నే తిరిగి వేడిచేయాల్సిన అవసరం రాకుండా చూసుకోవడమే ఉత్తమం.
  • ఒకవేళ అన్నం చల్లబడి పోతే.. అలాగే పాత్రలో పెట్టి రూమ్​ టెంపరేచర్​లో ఉంచకుండా.. ఫ్రిజ్​లో పెట్టండి. క్రిములు దరిచేరకుండా ఉంటాయి.
  • ఒకవేళ అన్నాన్ని మైక్రో ఒవెన్​లో, రైస్​ కుక్కర్​లో మళ్లీ వేడి చేయాలనుకుంటే.. కాసిన్ని నీళ్లు పోసి వేడిచేయండి.
  • లేదంటే.. నూనె లేదా.. బటర్​మిల్క్​ పోసినా సరే. కాకపోతే.. అవి మొత్తం ఇంకేదాక ఉండనివ్వాలి.
  • ఇలా చేస్తే.. అన్నం వేడి చేయాల్సి వచ్చినప్పుడు అందులో ఉండిపోయిన బ్యాక్టీరియా వల్ల సమస్యలు రావు. అవన్నీ పూర్తిగా నశిస్తాయి. అన్నం కూడా మళ్లీ ఫ్రెష్​గా మారుతుంది.
  • ఫైనల్​గా చెప్పే విషయం ఒక్కటే.. అన్నాన్ని తిరిగి వేడి చేయాలంటే.. సరైన పద్ధతులు ఉపయోగిస్తే సరే. లేదంటే ఇలాంటి సమస్యలే వస్తాయి.

Latest Updates