తప్పుడు వార్తలపై పోరాటానికి 1.15 మిలియన్ డాలర్లు

కరోనావైరస్‌పై వస్తోన్న తప్పుడు సమాచారానికి వ్యతిరేకంగా పోరాడటానికి 1.15 మిలియన్ డాలర్లు కేటాయిస్తున్నట్లు కెనడా ప్రభుత్వం తెలిపింది. మీడియా స్వేచ్ఛ గురించి జరిగిన గ్లోబల్ కాన్ఫరెన్స్‌లో ఆ ప్రభుత్వం ఈ విషయాన్ని వెల్లడించింది.

ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఇథియోపియా మరియు ఇండోనేషియాలోని జర్నలిస్టులతో కలిసి బీబీసీ మీడియా కోవిడ్-19 కోసం యాక్షన్ ప్రాజెక్ట్ పై పనిచేస్తుంది. ఈ లైఫ్ లైన్ ప్రాజెక్ట్ కోసం 1.15 మిలియన్ డాలర్లు ప్రకటిస్తున్నట్లు కెనడా విదేశాంగ మంత్రి ఫ్రాంకోయిస్-ఫిలిప్ తెలిపారు. స్పష్టమైన, వాస్తవ-ఆధారిత కోవిడ్-19 కంటెంట్‌ మాత్రమే అందుబాటులో ఉండేలా ఈ ప్రాజెక్ట్ చూస్తుంది.

మీడియా స్వేచ్ఛ కోసం జరిగిన రెండవ గ్లోబల్ కాన్ఫరెన్స్ సమావేశాన్ని కెనడా మరియు బోట్స్వానా కలిసి నిర్వహించాయి. సాంప్రదాయక మీడియా వనరులపై పెరుగుతున్న అపనమ్మకాన్ని తగ్గించడం, తప్పుడు సమాచారం నియంత్రించడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీడియా నిపుణులు ఈ కాన్పరెన్స్‌లో మాట్లాడారు. సుమారు ఆరు గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో.. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం పెరుగుతున్న సందర్భంగా సెన్సార్షిప్, ఆబ్జెక్టివిటీ మరియు పత్రికా స్వేచ్ఛ మరియు వ్యక్తీకరణ స్వేచ్ఛల గురించి నిపుణులు మాట్లాడారు. పత్రికా స్వాతంత్ర్యం మరియు స్వేచ్ఛను కాపాడాలని ఆయ దేశ ప్రభుత్వాలను కోరారు. అంతేకాకుండా మీడియా వ్యక్తులకు ఎక్కువ భద్రత కల్పించాలని వారు కోరారు. వచ్చే ఏడాది ఈ సదస్సును ఎస్టోనియా నిర్వహిస్తుందని ఫ్రాంకోయిస్-ఫిలిప్ తెలిపారు.

For More News..

అమెరికాలో 10 లక్షలకు పైగా పిల్లలకు కరోనా

Latest Updates