ఫైర్ యాక్సిడెంట్.. ఆస్పత్రిలో ప్రధాని తల్లి

  • అమ్మ ఇప్పుడు బాగానే ఉన్నారు: కెనడా పీఎం ట్రూడో

ఒట్టావా: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తల్లి మార్గరెట్ ట్రూడో నివాసం ఉంటున్న మాంట్రియల్ అపార్ట్ మెంట్ లో మంటల చెలరేగడంతో ఆమెను ఆస్పత్రికి తరలించినట్లు అక్కడి అధికార వర్గాలు తెలిపాయి. ఎమర్జెన్సీ సర్వీసు సిబ్బంది 70 మంది స్పాట్ కు చేరుకుని మంటల్ని అదుపు చేసినట్లు ప్రకటించాయి. మార్గరెట్ కు గాయాలయ్యాయని, అపార్ట్ మెంట్​లో దట్టంగా అలుముకున్న పొగతో ఆమెకు శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడ్డారని, దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నాయి. తొలుత ఐదో అంతస్తులో అంటుకున్న మంటలు కొద్ది నిమిషాల్లోనే అపార్ట్ మెంట్ అంతటా వ్యాపించినట్లు తెలిపాయి. ఈ ఘటనపై ప్రధాని ట్రూడో ట్విట్టర్ లో స్పందించారు. ‘‘నేను అమ్మతో మాట్లాడాను. ఆమె ఆరోగ్యం బాగుంది. తమ కోసం ప్రార్థించిన ప్రతిఒక్కరికి థ్యాంక్స్. ప్రమాద సమాచారం తెలియగానే స్పందించినవారికి కృతజ్ఞతలు”అని ట్వీట్ చేశారు.

Latest Updates