గ‌త ఐదునెల‌ల్లో తొలిసారి 24 గంట‌ల్లో జీరోమ‌ర‌ణాలు : ఎక్క‌డంటే

ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనాను అరిక‌ట్టేందుకు ప్ర‌యోగాలు జ‌రుగుతున్నాయి. కొన్ని దేశాలు క‌రోనా వ్యాప్తిని,మ‌రికొన్ని దేశాలు క‌రోనా మ‌ర‌ణాల్ని త‌గ్గించ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాయి. తాజాగా కెన‌డాలో 24గంటల్లో ఒక్క‌రూ చ‌నిపోలేద‌ని మార్చి 15 తర్వాత జీరో మ‌ర‌ణాలు న‌మోదైన‌ట్లు ఆరోగ్య‌శాఖ అధికారులు వెల్ల‌డించారు.

కెనడాలో సెప్టెంబర్ 10 నాటికి మరణించిన వారి సంఖ్య 9,163 గా ఉంది. సెప్టెంబర్ 10 నుంచి సెప్టెంబ‌ర్ 11 వ‌ర‌కు ఒక్క‌రు కూడా మ‌ర‌ణించ‌లేద‌ని..ఐదునెల‌ల త‌రువాత తొలిసారి జీరో మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి.

ఈ నెల 11 నాటికి కెనడాలో 9,163 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ఇక 11న 702 కొత్త కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 1,35,626కు పెరిగింది.

కాగా కెన‌డాలో క‌రోనా వైర‌స్ త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో అక్క‌డ లాక్ డౌన్ నిబంధ‌న‌ల్ని స‌డ‌లించారు. నిబంధ‌న‌ల్ని స‌డ‌లించిన త‌రువాత అక్క‌డ కేసులు పెరిగడంతో ప్ర‌భుత్వం హై అలెర్ట్ ప్ర‌క‌టించింది.

Latest Updates