మోకాళ్లపై నిల్చొని ఆందోళన కారులకు మద్దతు పలికిన ప్రధాని

కెనాడా ప్రధాని జస్టిన్ ట్రూడో మోకాళ్లపై నిల్చొని సంఘీభావం తెలిపారు. అమెరికాలో నల్ల జాతీయుడైన జార్జ్ ఫ్లాయిడ్ ను పోలీసు అధికారి కాలితో తొక్కి చంపిన ఉదంతంపై అమెరికా తో పాటు పలు దేశాల్లో ఆందోళనలు మిన్నంటాయి.

ఈ నేపథ్యంలో నల్లజాతీయులకు మద్దతుగా కెనడా ఒట్టావా నగరంలోని పార్లమెంట్ ఎదురుగా ట్రంప్ తీరును విమర్శిస్తు వేలాది మంది నల్లజాతీయులు రోడ్డెక్కి నిరసన తెలిపారు.

ఈ నిరసల్లో జరిగే సమయంలో అక్కడికి వచ్చిన  కెనాడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆందోళనకారులు ఆశ్చర్య పోయేలా మోకాళ్ల నిల్చొని స్టాండప్ టూ ట్రంప్ అంటూ స్లోగన్ పలికారు. అందేకాదు న్యాయం లేదు – శాంతి లేదు అంటూ నినదించారు. జస్టిన్ ట్రూడో నిర్ణయం పై ఆందోళన కారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఆయనకు మద్దతు పలికారు.

Latest Updates