రేపు అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ రద్దు..

రేపు అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ రద్దు..

తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో కీలక మార్పు చోటుచేసుకుంది. రేపు(బుధవారం) జరగబోయే  చర్చలో క్వశ్చన్ అవర్ ను రద్దు చేశారు. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు బులెటిన్ రిలీజ్ చేశారు. రూల్ 38 ప్రకారం స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.  అయితే ఈ విషయాన్ని సభ్యులు గమనించాలని కోరారు. దీంతో బడ్జెట్ పై నేరుగా చర్చ జరగనుంది.  శాసన మండలి లో క్వశ్చన్ అవర్ కొనసాగనుంది.  ఈ నెల 6న  2,90,396 కోట్లతో 2023, -24  బడ్జెట్ ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే.