ఆన్‌‌లైన్‌‌ పేమెంట్స్‌‌పై చార్జీలు రద్దు

న్యూఢిల్లీ: ఆన్‌‌లైన్‌‌లో డబ్బులు చెల్లించే వారికి తీపికబురు. ఇక నుంచి రూ.50 కోట్లు, అంతకంటే ఎక్కువ వార్షిక టర్నోవర్‌‌ ఉన్న వ్యాపార సంస్థలకు ఆన్‌‌లైన్‌‌లో డబ్బు కడితే అదనంగా ఎలాంటి చార్జీలూ వసూలు చేయకూడదని ప్రభుత్వం శుక్రవారం స్పష్టం చేసింది. వ్యాపారులు లేదా బ్యాంకులు మర్చంట్‌‌ డిస్కౌంట్‌‌ రేటు (ఎండీఆర్‌‌) వసూలు చేయకూడదని నిర్దేశించింది. భారీ టర్నోవర్‌‌ ఉన్న కంపెనీలు డిజిటల్‌‌ పేమెంట్స్‌‌పై చార్జీలు వసూలు చేయవద్దని, లావాదేవీల చార్జీలను బ్యాంకులు, ఆర్‌‌బీఐ భరించాలని బడ్జెట్‌‌ ప్రసంగంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Latest Updates