కరోనా ఎఫెక్ట్‌ : ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణం రద్దు

కరోనా ఎఫెక్ట్‌ సీతారాముల కళ్యాణంపై కూడా పడింది. దీంతో ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణం రద్దు అయ్యింది. కడప జిల్లా ఒంటిమిట్టలో శ్రీరామనవమి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం కన్నులపండుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టింది. ప్రతీ ఏడాది స్వామి వారి కళ్యాణాన్ని చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ సారికూడా భారీగా భక్తులు వచ్చే అవకాశముంది.  అయితే కరోనా ప్రభావం భక్తులపై  పడకుండా ఉండేలా ప్రభుత్వం…సీతారాముల కళ్యాణాన్ని రద్దు చేస్తూ ముందస్తు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

తిరుమల తిరుపతి దేవస్థానం ఇఒ ఎకె సింఘాల్‌ రాష్ట్ర ప్రభుత్వానికి ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణం నిర్వహించే విషయమై నివేదిక పంపారు. నివేదికను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఉన్నతస్థాయి చర్చల తర్వాత కళ్యాణాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

Latest Updates