ఏటా లక్ష మందికి క్యాన్సర్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో ఏటా లక్ష మంది క్యాన్సర్ బారినపడుతున్నారని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. హైదరాబాద్‌‌‌‌లోని హెచ్ఐసీసీలో నిర్వహిస్తున్న అపోలో కేన్సర్ సదస్సును గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తో కలిసి శుక్రవారం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…35 ఏండ్లు దాటిన ప్రతి మహిళా క్యాన్సర్ స్ర్కీనింగ్ చేయించుకోవా ల్సిన అవసరముందన్నారు. వ్యాధిపై అవగాహన లేకపోవడంతోనే క్యాన్సర్ మరణాలు సంభవిస్తు న్నాయని గవర్నర్ అన్నారు. ఐదు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో దేశవిదేశాల అంకాలజిస్టులు పాల్గొననున్నారు.

మరిన్ని వార్తల కోసం

Latest Updates