బాలీవుడ్ లో కాంచన: హిజ్రాగా బిగ్ బి ?

బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి..అమితాబ్…విభిన్న పాత్రలతో అభిమానుల మనసు దోచుకోవడంతో పాటు బాక్సాఫీస్  కలెక్షన్లు కొల్లగొట్టడంతో తనకు తానే సాటి.  తాజా ఓ వెరైటీ పాత్రలో యాక్టింగ్ చేయబోతున్నారు. అదీ ఓ హిజ్రా పాత్రలో. దీనిపై సినీ ఇండస్ట్రీ వర్గాలు కూడా అవుననే అంటున్నాయి. తమిళం, తెలుగులో బ్లాక్‌బస్టర్‌ విజయం అందుకున్న ‘కాంచన’ సినిమా బాలీవుడ్‌లో రీమేక్‌గా రాబోతోంది. సినిమాకు ‘లక్ష్మీ బాంబ్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాతో రాఘవ లారెన్స్‌ దర్శకుడిగా బాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నారు. బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ ఇందులో ప్రధాన పాత్రలో నటించనున్నారు. అక్షయ్‌కు జోడీగా కియారా అడ్వాణీ నటిస్తారు. అయితే ‘కాంచన’ చిత్రంలో ప్రముఖ నటుడు శరత్‌కుమార్‌ హిజ్రా పాత్రలో నటించారు.

ఇప్పుడు రీమేక్‌లో అమితాబ్‌ బచ్చన్‌ హిజ్రా పాత్రలో నటించేందుకు ఒప్పుకొన్నారని వార్తలు వస్తున్నాయి. అయితే అమితాబ్‌ పాత్ర గురించి చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మాధవన్‌, శోభితా ధూలిపాళ్ల కీలక పాత్రలు పోషించనున్నారు. 2020లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Latest Updates