18లోపు ఎన్నిక ఖర్చు వివరాలివ్వాలి.. లేకుంటే అనర్హులు

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులందరూ ఈ నెల 18 లోపు తమ ఎన్నిక ఖర్చు వివరాలివ్వాలన్నారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన 45 రోజులలోపు అంటే ఈ నెల 18వ తేదీ లోపు తమ ఎన్నికల ఖర్చు వివరాలను ఎన్నికల అధికారికి సమర్పించాలన్నారు. లేకపోతే మూడు సంవత్సరాల వరకు ఎన్నికలలో పోటీ చేసేందుకు అర్హత కోల్పోవడమే గాకుండా.. గెలిచిన అభ్యర్ధులు పదవి కూడా కోల్పోతారని అన్నారు. ఈ మేరకు అభ్యర్థులందరికీ నోటీసులు జారీచేయాలని అధికారులను ఆదేశించారు. మొత్తం పోటీచేసిన 1122 మంది అభ్యర్ధులకు గాను 999 మంది తమ ఎన్నికల ఖర్చుల వివరాలను సమర్పించారని,.. మిగిలిన 123 మంది అభ్యర్ధులు గడువులోపు సమర్పించేలా చూడాలన్నారు. అధికారులు తమ విధులు నిర్వహించే విషయంలో నిబంధనలను ఖచ్చితంగా పాటించాలన్నారు.

వ్యాక్సిన్ మొదటి డోసు మోడీ తీసుకోవాలి

 

Latest Updates