అమెరికాను తాకిన హైదరాబాద్ డాక్టర్ హత్యోదంతం

మధ్యం మత్తులో నలుగురు మృగాళ్లు డాక్టర్‌పై అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటన మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతుంది. నిందితులని ఉరి తీయాలంటూ దేశమంతా ప్రజలు రోడ్డెక్కుతున్నారు.  న్యాయం కోసం నిరసన జ్వాలలు, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటూ చేస్తున్న కొవ్వత్తుల ర్యాలీలు దేశం దాటి అమెరికాను కూడా చేరాయి. అమెరికాలో నివసిస్తున్న భారత ప్రజలు.. హైదరాబాద్ ఘటన గురించి తెలుసుకొని చలించిపోయారు. డాక్టర్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ డిసెంబర్ 1, ఆదివారం ఉదయం 11:30 నిమిషాలకు కొవ్వత్తులు వెలిగించాలని ప్రవాసాంధ్రులు నిర్ణయించారు. ఇందుకోసం న్యూజెర్సీలోని 76 నేషనల్ రోడ్‌ను వేదికగా ప్రకటించారు. అంతేకాకుండా.. టెక్సాస్‌లో కూడా డాక్టర్ ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ.. ఈ ఘటనను ఖండిస్తూ క్యాండిల్ లైట్ విజిల్ ఏర్పాటు చేశారు అక్కడి తెలుగువారు. దానికోసం టెక్సాస్‌లోని జోయ్ ఈవెంట్ సెంటర్‌లో డిసెంబర్ 1, ఆదివారం సాయంత్రం 5:30 నిమిషాలకు కార్యక్రమాన్ని చేస్తున్నారు. డాక్టర్ హత్యోదంతం ఘటనను ఖండించే ప్రతి ఒక్క ప్రవాసాంధ్రుడు ఈ కార్యక్రమాలకు హాజరుకావాలని కార్యక్రమ ప్రతినిధులు పిలుపునిచ్చారు.

ప్రియాంక ఎలా చనిపోయిందో తల్లికి చెప్పిన పాషా

Latest Updates