గంజాయి స్మగ్లింగ్.. ఇద్దరు యువకులు అరెస్ట్

హైదరాబాద్: గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు యువకులను అరెస్టు చేశారు KPHB పోలీసులు. గోకుల్ ప్లాట్స్ సమీపంలోని KYR వైన్స్ సమీపంలో గంజాయి అమ్ముతున్నారన్న సమాచారంతో అక్కడకు వెళ్లిన పోలీసులు.. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 7 వందల గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 20 గ్రాముల ప్యాకెట్ ను 500 రూపాయలకు అమ్ముతున్నారని పోలీసులు చెప్పారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Latest Updates