సెట్స్ కు వెళ్లడానికి ఎదురు చూడలేను: రామ్ చరణ్​

హైదరాబాద్: కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో సినిమా షూటింగ్ లు లేక మూవీ స్టార్స్ ఖాళీగా ఉంటున్నారు. ఇంటి పనుల్లో తమ ఫ్యామిలీస్ కు సాయపడుతూ, నచ్చిన పుస్తకాలు చదువుతూ, వెరైటీ వంటలు ట్రై చేస్తూ అనుకోకుండా వచ్చిన లాంగ్ బ్రేక్ ను సరదాగా గడుపుతున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తన వైఫ్ ఉపాసన కామినేనితో కలసి ఈ టైమ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈమధ్యే నానమ్మ అంజలీ దేవి నుంచి ఫ్రెష్ బటర్ ను తయారు చేయడం నేర్చుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోస్ ను ట్విట్టర్ లో షేర్ చేసిన చరణ్.. తన కెరీర్ లో డీసెంట్ హిట్ గా నిలిచిన ధ్రువ సినిమా షూటింగ్ పిక్స్ ను ట్విట్టర్ లో తాజాగా పోస్ట్ చేశాడు. ‘తిరిగి సెట్స్ కు వెళ్లడడానికి ఎదురు చూస్తూ ఉండలేను. అప్పటిదాకా ఇంట్లోనే సేఫ్ గా ఉండండి’ అంటూ మెగా హీరో ట్వీట్ చేశాడు. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన ధ్రువ.. తమిళ హిట్ మూవీ తనీ ఒరువన్ కు రీమేక్. చరణ్ లాక్ డౌన్ కు ముందు ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ వహిస్తున్న ఆర్ఆర్ఆర్ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. లాక్ డౌన్ తీసేశాక మళ్లీ ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో చరణ్ పాల్గొంటాడు.

Latest Updates