అట్లాంటా: ఫిఫా వరల్డ్ కప్‌లో మరో ఆశ్చర్యకరమైన ఫలితం వచ్చింది. సోమవారం జరిగిన గ్రూప్-హెచ్ లీగ్ మ్యాచ్‌లో యూరోపియన్ చాంపియన్ స్పెయిన్‌ను కేప్ వెర్డే నిలువరించింది. దాంతో ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్ 0–0తో డ్రా అయ్యింది. ఐదున్నర లక్షల జనాభా కలిగిన కేప్ వెర్డే వరల్డ్ కప్‌కు అర్హత సాధించిన దేశాల్లో రెండో అతి చిన్న దేశం.
టోర్నీ తొలి మ్యాచ్‌లోనే బలమైన స్పెయిన్‌తో తలపడటంతో దాదాపుగా ఓటమి ఖాయమనుకున్నారు. కానీ వెర్డే గోల్ కీపర్ వోజిన్హా అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. స్పెయిన్ స్టార్లు లామిన్ యమల్, నికో విలియమ్స్, రోడ్రి, పెడ్రి, గావి డాని ఓల్మో, మార్క్ కుకురెల్లా చేసిన బలమైన ఎదురుదాడులకు వోజిన్హా ఎదురొడ్డి నిలిచాడు.
కనీసం ఒక్క గోల్ చాన్స్ కూడా ఇవ్వలేదు. వెర్డే ప్లేయర్లు ర్యాన్ మెండిస్, లోగాన్ కోస్టా, జమీరో మాంటెరో, డైలాన్ లివ్రామెంట్ బలమైన స్పెయిన్ డిఫెన్స్‌పై పదేపదే దాడులు చేసి ఒత్తిడి పెంచారు.
