కర్మన్‌ఘాట్‌లో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

శనివారం అర్ధరాత్రి హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి ఎదురుగా ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఆ తర్వాత రోడ్డు పక్కన ఉన్న హోటళ్లోకి దూసుకెళ్లింది. మద్యం మత్తులో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు అంటున్నారు. సాగర్ రింగ్ రోడ్డు నుంచి చంపాపేట్ వస్తుండగా ఈ ఘటన జరిగింది. చనిపోయిన వారి మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన వారిని వినాయక్, సాయి, శ్రీరాం గా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

For more News..

వైరల్ వీడియో: బాహుబలి మార్ఫ్ వీడియోలో ట్రంప్ ఫ్యామిలీ

అమెరికాలో తెలుగు టెకీ మృతి.. డెలివరీ తర్వాత భార్యకు చెప్పిన ఫ్రెండ్స్

టీచర్లకు గుడ్‌న్యూస్.. సర్వీసులో చేరిన మొదటి రోజు నుంచే బెనిఫిట్స్

Latest Updates